రూ.20 కోసం కొట్లాట.. ఒకరు మృతి 

తాజా వార్తలు

Published : 28/09/2020 17:08 IST

రూ.20 కోసం కొట్లాట.. ఒకరు మృతి 

న్యూదిల్లీ : ముగ్గురి మధ్య రూ.20 కోసం జరిగిన కొట్లాట ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. దేశ రాజధానిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దిల్లీలోని బురారీ ప్రాంతంలో నివాసం ఉండే రూపేశ్‌ అనే వ్యక్తి స్థానికంగా ఉండే బార్బర్‌ దుకాణానికి క్షవరం చేయించుకోడానికి వెళ్లారు. క్షవరం చేసిన వ్యక్తి రూపేశ్‌ను రూ.50 ఇవ్వమని అడిగారు. రూపేశ్‌ రూ.30 ఇచ్చి మిగతాది తర్వాత ఇస్తానని అన్నారు. మిగతా రూ. 20 కూడా వెంటనే ఇవ్వాలని క్షవరం చేసిన సంతోష్ అతని సోదరుడు సరోజ్‌ రూపేశ్‌తో వాగ్వాదానికి దిగారు. అది పెద్ద ఘర్షణకు దారి తీసి ఇద్దరు సోదరులు రూపేశ్‌ను కర్రలతో కొట్టారు. తీవ్రగాయాలతో ఆసుప్రతికి వెళ్లిన బాధితుడు చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన ఈ నెల 24న జరిగిందని తమకు సోమవారం అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని