రాఖీ కోసం.. జనజీవన స్రవంతిలోకి 

తాజా వార్తలు

Published : 04/08/2020 00:53 IST

రాఖీ కోసం.. జనజీవన స్రవంతిలోకి 

రాయ్‌పూర్‌(ఛత్తీస్‌గఢ్‌‌): అన్నాచెల్లెళ్ల అనుబంధం ఎంతో విలువైంది. అలాంటి బంధాన్ని కాపాడుకోవడానికి ఒకరికొకరు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఇలాంటి ఘటనే ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది.
తోబుట్టుచెల్లి కోరగానే రక్షాబంధన్‌ రోజున అన్న ఆయుధాన్ని వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చేశాడు. దంతెవాడకు చెందిన మల్లా మావోయిస్టు దళంలో డిప్యూటీ కమాండర్‌గా ఉన్నాడు. అనేక బాంబు పేలుళ్లలో అతడి హస్తముంది. మల్లాపై రూ.8లక్షల రివార్డు కూడా ఉంది. పోలీసులు రక్షాబంధన్‌ రోజున అతడి చెల్లి ద్వారా వామపక్ష భావజాలాన్ని వదిలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేయించారు. చెల్లెలి కోసం ఎట్టకేలకు మల్లా అడవిని, ఉద్యమాన్ని, ఆయుధాన్ని వీడి జనజీవనంలోకి వచ్చాడు. అతడి చెల్లి మల్లాకు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించి మురిసిపోయింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని