అందాల పోటీల నుంచి ఐఏఎస్‌కు..
close

తాజా వార్తలు

Published : 06/08/2020 00:39 IST

అందాల పోటీల నుంచి ఐఏఎస్‌కు..

దిల్లీ: ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం ఒక వైపు.. సెలబ్రెటీ హోదా, ఫ్యాషన్ మెరుపులు మరోవైపు, రెండింటిలో ఏది కావాలంటే ఎక్కుమంది మొగ్గుచూపేది ఫ్యాషన్ రంగం వైపే. అయితే ఈ రెండింటిలోనూ తన సత్తా చాటుతోంది ఐశ్వర్య శోరాన్. తాజాగా వెలువడిన సివిల్ సర్వీసెస్‌-2019 ఫలితాల్లో ఆమె 93వ ర్యాంకు సాధించారు. ఎలాంటి కోచింగ్ లేకుండా తొలి ప్రయత్నంలోనే ఆమె ఈ ఘనత సాధించడం విశేషం. అయితే చాలా తక్కువ మందికి తెలసిన విషయం ఏంటంటే..ఐశ్వర్య శోరాన్‌ 2016 ఫెమినా మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్ట్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

ఆ పేరంటే తల్లికి ఎంతో ఇష్టమంట..

మాజీ ప్రపంచ సుందరి, ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాయ్‌ అంటే శోరాన్ తల్లికి ఎంతో ఇష్టమంట. అందుకే ఆమెకు ఐశ్వర్య అనే పేరు పెట్టారు. ఐశ్వర్య తండ్రి ఆర్మీలో కమాండింగ్ అధికారిగా పనిచేస్తున్నారు. తను దిల్లీలో డిగ్రీ చదివే రోజుల్లోనే ఆమె పలు అందాల్లో పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. 2015-ఫ్రెష్ ఫేస్‌ విన్నర్‌ దిల్లీ, 2016-క్యాంపస్‌ ప్రిన్సెస్‌ దిల్లీ వంటి అందాల పోటీల్లో పాల్గొని ఐశ్వర్య విజేతగా నిలిచారు. ఇక 2106లో జరిగిన ఫెమినా మిస్‌ ఇండియా ఫైనల్స్‌ వరకు చేరుకున్నారు. అయితే కొద్దిలో కిరీటాన్ని చేజార్చుకుంది. తర్వాత దేశంలో అత్యున్నతంగా భావించే సివిల్స్‌వైపు దృష్టి సారించి, మొదటి ప్రయత్నంలో విజయం సాధించారు. ఐశ్వర్య సివిల్స్‌ ఎంపిక కావడంపై ఎంతో గర్వంగా ఉందని ఫెమినా మిస్‌ ఇండియా తన అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది.

అది తప్పని నిరూపించావు..

అలానే పలువురు ఐఏఎస్‌, ఐఎఫ్ఎస్‌ అధికారులు ట్విటర్ వేదికగా ఐశ్వర్యకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఫాష్యన్ నుంచి సివిల్‌ సర్వీస్‌వైపు, నిజంగా ఇది ఎంతో గొప్ప ప్రయాణం. ఒకే వ్యక్తి విభిన్న రంగాల్లో రాణించేందుకు నువ్వు ఎంతో మందికి స్ఫూర్తినిస్తావు, నీకు స్వాగతం’, ‘అందమైన వారికి తెలివితేటలు ఉండవు అనే మాట తప్పని, నువ్వు నిరూపించావు. మహిళలు తమ ఇష్టాలకు అనుగుణంగా ఫ్యాషన్‌ రంగాన్ని ఎంచుకుంటే ఆమె తెలివిలేనిదని కాదు’, ‘అందం, తెలివితేటలు కలిస్తే ఐశ్వర్య శోరాన్’ అంటూ పలువురు నెటిజన్లు ఆమెను అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని