శిరోముండనం బాధితుడికి మంత్రి పరామర్శ

తాజా వార్తలు

Updated : 30/08/2020 16:26 IST

శిరోముండనం బాధితుడికి మంత్రి పరామర్శ

పెందుర్తి: విశాఖ జిల్లా పెందుర్తిలో శిరోముండనం బాధితుడు శ్రీకాంత్‌ను మంత్రి అవంతి శ్రీనివాస్‌ పరామర్శించారు. ఈ ఘటన అమానుషమని చెప్పారు. ప్రభుత్వం బాధితుడిని అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఘటన జరిగిన 24 గంటల్లో నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం బాధితుడికి మంత్రి అవంతి ద్వారా పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ రూ.50వేల ఆర్థికసాయం అందజేశారు. మరోవైపు తెదేపా అధినేత చంద్రబాబు కూడా బాధితుడితో ఫోన్‌లో మాట్లాడారు. న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ కేసులో ఇప్పటికే విశాఖ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద  ఏడుగురిపై కేసు నమోదుచేసి, అరెస్టు చేశారు. వారిలో సినీ నిర్మాత నూతన్‌నాయుడి భార్య సహా నలుగురు మహిళలు ఉన్నారు. నూతన్‌నాయుడు ఇంట్లో సీసీటీవీ కెమెరా ఫుటేజిలను పరిశీలించి, ఆధారాలు సేకరించారు. ఈ కేసు దర్యాప్తులో ఫుటేజిలు కీలకంగా మారాయి. నూతన్‌నాయుడు భార్య ప్రియమాధురితో పాటు దాడులకు పాల్పడిన ఇందిరారాణి, క్షురకుడు రవికుమార్‌, ఇతర ఉద్యోగులు వరహాలు, బాలగంగాధర్‌, ఎం.ఝాన్సీ, కె.సౌజన్యలను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి

కర్రలతో దాడి చేసిదాష్టీకం

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని