
తాజా వార్తలు
మంత్రి హరీశ్.. క్రికెటర్ అవతారం
సిద్దిపేట టౌన్: రాజకీయాల్లో నిరంతరం తీరికలేకుండా ఉండే రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు క్రికెటర్ అవతారం ఎత్తారు. ఇన్నిరోజులు వరుసగా ఎన్నికల ప్రచారంలో తలమునకలైన ఆయన తాజాగా క్రికెట్ ఆడి సేదతీరారు. హరీశ్ సారథ్యంలోని సిద్దిపేట జిల్లా క్రికెట్ అసోసియేషన్, హైదరాబాద్‌కు చెందిన మెడికవర్ ఆసుపత్రి జట్ల మధ్య బుధవారం రాత్రి స్నేహపూర్వక టీ20 మ్యాచ్ జరిగింది. దీనికి సిద్దిపేట లఘు క్రీడామైదానం వేదికైంది. ఈ మ్యాచ్‌లో సిద్దిపేట జట్టు 15 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన సిద్దిపేట నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సిద్దిపేట జట్టు బ్యాట్స్‌మెన్ బౌండరీల వరద పారించారు. ఆ జట్టులో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మంత్రి హరీశ్‌రావు క్రీజులో ప్రొఫెషనల్ క్రికెటర్లా కనిపించారు. కేవలం 12బంతుల్లోనే 3ఫోర్ల సాయంతో 18 పరుగులు చేశారు. క్రీజులో ఉన్నంత సేపూ మెరుపు బ్యాటింగ్‌తో తోటి ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపారు.
తీవ్ర ఉత్కంఠ..
166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెడికవర్ జట్టు 19.5 ఓవర్లలో 150 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆ జట్టు 15 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే ఈ మ్యాచ్ నువ్వానేనా అన్నట్లు సాగింది. విజయం కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమించాయి. అయితే సిద్దిపేటనే విజయం వరించింది. ఈ ఆట చూసిన ప్రేక్షకులు ఉత్కంఠకు గురయ్యారు. కాగా సిద్దిపేట జట్టులో పోలీస్ కమిషనర్ జోయల్‌డేవిస్ సభ్యుడిగా ఉన్నారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
