ఆ ఇళ్లు విక్రయిస్తే కేసు: హరీశ్‌రావు‌

తాజా వార్తలు

Published : 28/12/2020 01:07 IST

ఆ ఇళ్లు విక్రయిస్తే కేసు: హరీశ్‌రావు‌

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట: రెండు పడకగదుల ఇళ్లు పేదల కల అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఒక ఉద్యోగి ఇల్లు నిర్మించుకుంటే కొంత అప్పు అవుతుందని.. అలాంటిది ఏం లేకుండానే పేదవారి ఇంటి కలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని మంత్రి కొనియాడారు. పేదలు ఆత్మ గౌరవంతో బతకాలనేదే కేసీఆర్‌ ఆకాంక్ష అని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదల కోసం నిర్మించారన్నారు. నాలుగో విడతలో భాగంగా సిద్దిపేటలోని కేసీఆర్‌ నగర్‌లో మరో 168 రెండు పడక గదుల ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు హరీశ్‌రావు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మనిషికి అతి ముఖ్యమైన ఇంటి నిర్మాణం, పెళ్లికి రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తోందన్నారు. అనర్హులు ఇల్లు తీసుకుంటే మరో పేదవాడికి అన్యాయం చేసినట్టే అవుతుందన్నారు. తనను విమర్శించిన భాజపా కార్యకర్తలకు కూడా ఇల్లు మంజూరైందని చెప్పారు. లబ్ధిదారులెవరైనా ఇల్లు విక్రయించేందుకు ప్రయత్నిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు విషయంలో అధికారులెవరికైనా లంచం ఇచ్చినట్లు ఎవరైనా నిరూపించగలిగితే వారికి రూ. 10వేలు బహుమతిగా ఇస్తానని హరీశ్‌రావు ప్రకటించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని