21 అంబులెన్సు లను ప్రారంభించిన కేటీఆర్‌

తాజా వార్తలు

Updated : 03/10/2020 15:18 IST

21 అంబులెన్సు లను ప్రారంభించిన కేటీఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా చేపట్టిన ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమంలో భాగంగా అంబులెన్స్‌ల ప్రారంభోత్సవం కొనసాగుతోంది. ఇందులో భాగంగా 21 అంబులెన్సులను ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ శనివారం ప్రారంభించారు. మంత్రులు ఈటల రాజేందర్‌, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీలు రంజిత్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి మూడు చొప్పున; మంత్రి నిరంజన్‌ రెడ్డి ఒకటి; ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌ రెడ్డి రెండు; చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్‌, ఉపేందర్‌ రెడ్డి, ఆరూరు రమేశ్‌, ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి, వరంగల్‌కు చెందిన లక్ష్మణరావు ఒక్కో అంబులెన్స్‌ను విరాళంగా ఇచ్చారు. ఈ అంబులెన్సులను ఉమ్మడి మహబూబ్‌ నగర్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, రంగారెడ్డి, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో సేవలు అందించేందుకు వినియోగించనున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని