కానిస్టేబుల్‌ బాబ్జీకి హరీశ్‌రావు ప్రశంస

తాజా వార్తలు

Updated : 05/11/2020 14:33 IST

కానిస్టేబుల్‌ బాబ్జీకి హరీశ్‌రావు ప్రశంస

హైదరాబాద్‌: నగరంలోని కోఠి వద్ద ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన అంబులెన్స్‌ను సమయస్ఫూర్తితో వ్యవహరించి సకాలంలో ఆసుపత్రికి వెళ్లేలా చేసిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్ బాబ్జీని మంత్రి హరీశ్‌రావు అభినందించారు. పోలీస్‌ శాఖ గర్వంగా భావించేలా కానిస్టేబుల్‌ వ్యవహరించారని మంత్రి కొనియాడారు. నిత్యం రద్దీగా ఉండే మొజంజాహీ మార్కెట్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న బాబ్జీ కోఠి వెళ్లే మార్గంలో ఓ అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకోవడాన్ని గమనించి ఎలాగైనా ట్రాఫిక్‌ క్లియర్‌ చేయాలని భావించి పరుగెడుతూ ట్రాఫిక్‌ క్లియర్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో సకాలంలో ఆ అంబులెన్స్‌ ఆస్పత్రికి చేరుకోవడంతో అందులోని వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో కానిస్టేబుల్ సమయస్ఫూర్తికి పోలీస్ ఉన్నతాధికారులతో పాటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.

 

ఇదీ చదవండి..
నువ్వు దేవుడివి బాబ్జీ!Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని