పాల సరఫరాకు ఆర్థిక వనరులు చేకూర్చండి

తాజా వార్తలు

Published : 21/07/2020 18:08 IST

పాల సరఫరాకు ఆర్థిక వనరులు చేకూర్చండి

మంత్రి హరీశ్‌ను కోరిన తలసాని

హైదరాబాద్‌: అరణ్య భవన్‌లో మంత్రులు హరీశ్‌రావు, తలసాని సమీక్ష నిర్వహించారు. పశుసంవర్థక, మత్స్య, ఆర్థిక రంగాల్లో పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం తలసాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంగన్‌వాడీల ద్వారా గర్బిణీలకు రోజూ పాలు సరఫరా చేస్తున్నామన్నారు. దూర ప్రాంతాలకు సరఫరా చేసే క్రమంలో పాలు పాడవుతున్నాయని తెలిపారు. విశాఖ డెయిరీ ద్వారా టెట్రాప్యాక్‌ పాల సరఫరాకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. దీనికోసం ఆర్థిక వనరులను సమకూర్చాలని మంత్రి హరీశ్‌రావును కోరారు. ఈ విషయాన్ని పరిశీలించాలని హరీశ్‌రావు ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. గోపాల మిత్ర వేతన బకాయిలు, పాల సేకరణ ప్రోత్సాహం విడుదల చేయాలని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని