ప్రియుడితో వివాహం జరిపించాలని..

తాజా వార్తలు

Published : 10/11/2020 01:48 IST

ప్రియుడితో వివాహం జరిపించాలని..

హోర్డింగ్‌ ఎక్కిన బాలిక

ఇండోర్‌: ప్రేమించిన ప్రియుడితో వివాహం జరిపించాలని ఓ బాలిక హోర్డింగ్‌ ఎక్కింది. తను ప్రేమించిన బాలుడితో వివాహానికి తల్లి నిరాకరించిందని, ప్రియుడితోనే తన వివాహం జరిపించాలంటూ హోర్డింగ్‌ ఎక్కి నిరసన తెలిపింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సదరు బాలిక చేసిన ఈ పనితో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం రాత్రి ఇండోర్‌లోని పరదేసిపురలోని ఓ హోర్డింగ్‌పైకి ఎక్కిన బాలిక ఫోను చూస్తూ కనిపించింది. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు గుమిగూడారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాలికను కిందకు దించే ప్రయత్నం చేశారు. అయినా బాలిక దిగిరాకపోవడంతో ఆమె ప్రేమించిన బాలుడిని పోలీసులు ఫోనులో సంప్రదించారు. అనంతరం ఈ బాలుడు బాలికకు ఫోన్ చేయడంతో నిరసన ఉపసంహరించుకున్న మైనర్‌ కిందకు దిగివచ్చింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని