సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌ కాలుష్యంపై కమిటీ

తాజా వార్తలు

Published : 08/09/2020 16:39 IST

సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌ కాలుష్యంపై కమిటీ

ఏర్పాటు చేసిన జాతీయ హరిత ట్రైబ్యునల్‌.

దిల్లీ: ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు గనుల కాలుష్యంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై బెంచ్‌ విచారణ చేపట్టింది. సత్తుపల్లి వాసి బానోతు నందూనాయక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ రామకృష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి కాలరీస్‌ సంస్థ, ఖమ్మం జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. అనంతరం సత్తుపల్లి ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు గనుల కాలుష్య ప్రభావంపై నిపుణుల కమిటీని ఎన్జీటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ పర్యావరణ శాఖ, తెలంగాణ గనుల శాఖ, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ ప్రతినిధులను సభ్యులుగా చేర్చింది. ఈ కమిటీ తమ నివేదికను నవంబర్‌ 9లోపు అందజేయాలని ఎన్జీటీ ఆదేశించింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని