సినీ ప్రపంచానికి తీరని లోటు: లోకేశ్

తాజా వార్తలు

Published : 25/09/2020 17:05 IST

సినీ ప్రపంచానికి తీరని లోటు: లోకేశ్

అమరావతి: ఆబాల గోపాలాన్ని తన గానంతో అలరించిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి సంగీత, సాహిత్య, సినీ ప్రపంచానికి తీరని లోటని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. బాలు మృతికి ఆయన సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా భారతీయ భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడిన బాలూ మన మధ్యలేకపోయినా.. ఆయన పాట, మాట, బాట, నటన, సంగీతం అన్నీ చిరకాలం జీవించే ఉంటాయన్నారు. 

కళా, సోమిరెడ్డి సంతాపం

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై ఏపీ తెదేపా అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు, పొలిట్‌ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఎస్పీబీ మృతి తీవ్ర విచారకరమని.. ఆయన మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని కళా వెంకట్రావు చెప్పారు. ఆయన మృతి భారతీయ సినీలోకానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీబీ ఆత్మకు శాంతి చేకూరాలని కళా ఆకాంక్షించారు. గాన గంధర్వుడి మృతి పట్ల సోమిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కారని గుర్తు చేశారు. ఐదు విశ్వవిద్యాలయాల్లో డాక్టరేట్‌ పొందిన తమ నెల్లూరు బిడ్డ బాలసుబ్రహ్మణ్యమని ఆయన కొనియాడారు. ఎస్పీబీ కుటుంబ సభ్యులకు సోమిరెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని