గవర్నర్‌ను కలిసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ

తాజా వార్తలు

Updated : 18/11/2020 13:44 IST

గవర్నర్‌ను కలిసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్  బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను  కలిశారు. ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకత, ఎన్నికలపై ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై గవర్నర్‌తో చర్చించినట్టు సమాచారం. దాదాపు 40 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. సమావేశం ముగిసిన తర్వాత రమేశ్‌ కుమార్‌ నేరుగా తన కార్యాలయానికి వెళ్లారు. ఈరోజు సాయంత్రం జిల్లా అధికారులతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. స్థానిక ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్‌లో కీలక ప్రకటన చేసే అవకాశముంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని