శిరోముండనం కేసులో నూతన్‌నాయుడు అరెస్ట్‌

తాజా వార్తలు

Published : 05/09/2020 01:51 IST

శిరోముండనం కేసులో నూతన్‌నాయుడు అరెస్ట్‌

విశాఖపట్నం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పెందుర్తి శిరోముండనం కేసులో సినీ నిర్మాత నూతన్‌నాయుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కర్ణాటకలోని ఉడిపిలో నూతన్‌నాయుడిని అరెస్ట్‌ చేసినట్లు విశాఖ సీపీ మనీష్‌ కుమార్‌ సిన్హా వెల్లడించారు. అతడిని స్థానిక కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. శ్రీకాంత్‌ అనే దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటనలో ఇప్పటికే నూతన్‌నాయుడు భార్య మధుప్రియ, ఇంటి సహాయకురాలు వరహాలు, ఇందిర, ఝాన్సీ, సౌజన్య, బాలు, రవిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. తాజాగా నూతన్‌ నాయుడిని అరెస్ట్‌ చేసినట్లు సీపీ చెప్పారు. ప్రస్తుతం అతడు కర్ణాటక పోలీసుల అదుపులో ఉన్నాడని..త్వరలో విశాఖ తీసుకొస్తామన్నారు. నూతన్‌నాయుడు నుంచి 3 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు.

పీవీ రమేశ్‌‌ పేరుతో ఫేక్‌ కాల్స్‌..

మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌ పేరుతో నూతన్‌ నాయుడు ఫేక్‌ కాల్స్‌ చేశారని సీపీ మనీష్‌ కుమార్‌ సిన్హా తెలిపారు. పీవీ రమేశ్‌ పేరుతో కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.సుధాకర్‌కు నూతన్‌ నాయుడు ఫోన్‌ చేసినట్లు గుర్తించామన్నారు. మీరు పేరుతో తనకు ఫోన్‌ వచ్చిందని డా.సుధాకర్‌.. పీవీ రమేశ్‌కు చెప్పారన్నారు. విషయం తెలిసిన వెంటనే పీవీ రమేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారని.. తన ఫోన్‌ నంబర్‌ను మరో వ్యక్తి వినియోగిస్తున్నట్లు అందులో పేర్కొన్నారని సీపీ వివరించారు. తన పేరుతో ఫోన్లు చేస్తున్న వ్యక్తి ఎవరో కనుక్కోవాలని ఆయన కోరారని చెప్పారు. దీనిపై దర్యాప్తు చేయగా ఫేక్‌ కాల్స్‌ చేస్తోంది నూతన్‌ నాయుడని తేలిందన్నారు. ఆ నంబర్‌తో 30 మంది అధికారులకు ఫోన్‌ చేసినట్లు గుర్తించామని తెలిపారు. సిమ్‌ను ధ్వంసం చేయాలని నూతన్‌నాయుడు చూశారని.. దర్యాప్తులో మిగిలిన విషయాలు వెల్లడవుతాయని సీపీ చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని