మోదీ చేసిన ఆ ట్వీట్‌కు అత్యధిక రీట్వీట్లు!

తాజా వార్తలు

Published : 09/12/2020 02:03 IST

మోదీ చేసిన ఆ ట్వీట్‌కు అత్యధిక రీట్వీట్లు!

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ వేదికగా ఈ ఏడాది ఎక్కువ మంది కరోనా వైరస్‌ వ్యాధి గురించే చర్చించుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. కరోనా తర్వాతి స్థానంలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ మరణం, యూపీలోని హాథ్రస్‌లో దళిత యువతి హత్యాచారం విషయాలే ఎక్కువగా చర్చలోకి వచ్చాయని పేర్కొంది. ఈ మేరకు సంస్థ 2020లో ఎక్కువగా చర్చకు వచ్చిన రీట్వీట్లు, హాష్‌ట్యాగ్‌ల సమాచారాన్ని ఓ ప్రకటనలో వెల్లడించింది. 

రాజకీయాల విభాగంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్‌లో 5న చేసిన ఓ ట్వీట్‌ను ఎక్కువ మంది రీట్వీట్‌ చేశారని తెలిపింది. నరేంద్రమోదీ కరోనా వైరస్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ 5న దీపాలు వెలిగిస్తూ చేసిన ట్వీట్‌ను ‘మోస్ట్‌ రీట్వీటెడ్‌ ట్వీట్‌ ఇన్‌ పాలిటిక్స్‌’ విభాగంలో తొలి స్థానంలో ఉందని వెల్లడించింది. వ్యాపారవేత్తల విభాగానికి వస్తే.. కొవిడ్‌ కారణంగా ప్రభావితమైన వారికి చేయూతనిస్తూ ప్రముఖ వ్యాపార వేత్త రతన్‌ టాటా చేసిన ట్వీట్‌ ప్రాచుర్యం పొందినట్లు పేర్కొంది. కరోనా కారణంగా ప్రభావితమైన వారికి రక్షణగా నిలుస్తూ రతన్‌ టాటా రూ.500 కోట్ల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన తీసుకున్న ఆ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా ఎంతో మంది అభినందించారు. 

ఈ సందర్భంగా ట్విటర్‌ ఇండియా ఎండీ మనీష్‌ మహేశ్వరీ మాట్లాడుతూ.. ‘2020 సంవత్సరంలో ట్విటర్‌లో జరిగిన సంభాషణలు ప్రత్యేకమైనవి. ఎక్కువగా కరోనా సంబంధించిన విషయాలపైనే చర్చలు జరిగాయి. 2021లో దేశం అన్ని రంగాల్లో తిరిగి పుంజుకుంటుంది’ అని మహేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇవీ చదవండి

వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే పొడిగింపు

గాయని సునీత నిశ్చితార్థంTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని