ఈ ఇండియన్‌కు దుబాయ్‌ పోలీసుల ప్రశంసలు!
close

తాజా వార్తలు

Published : 14/09/2020 01:07 IST

ఈ ఇండియన్‌కు దుబాయ్‌ పోలీసుల ప్రశంసలు!

దుబాయ్‌: యూఏఈలో ఉంటున్న ఓ భారతీయుడు చేసిన పనికి అక్కడి అధికారులు ప్రశంసించకుండా ఉండలేపోయారు. ఏకంగా అవార్డుతో సత్కరించి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఇంతకీ పరాయి దేశంలో మన దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసే పని ఆయన ఏం చేసినట్లు అని ఆలోచిస్తున్నారా.. వివరాల్లోకి వెళితే..

రితేశ్‌ జేమ్స్‌ గుప్తా అనే వ్యక్తి గత కొన్నే్ళ్లుగా దుబాయ్‌లో ఉంటున్నాడు. శనివారం ఆయనకు ఓ చోట ఓ బ్యాగ్‌ కనిపించింది. తెరిచి చూస్తే 14వేల అమెరికన్‌ డాలర్ల నగదు, రెండు లక్షల దిర్హామ్‌లు(సుమారు రూ.40 లక్షలు) విలువ చేసే బంగారం ఉంది. వెంటనే ఆయన దాన్ని తీసుకెళ్లి దగ్గర్లో ఉన్న పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. గుప్తా నిజాయతీని మెచ్చిన వారు ఆయనకు ‘సర్టిఫికేట్‌ ఆఫ్‌ అప్రిసియేషన్‌’ను అందజేశారు. బాధ్యతగల పౌరుడిగా వ్యవహరించినట్లు ప్రశంసల్లో ముంచెత్తారు. పోలీసులు.. పౌరుల మధ్య సహకారం పెరగడానికి ఇలాంటి ఘటనలు ఎంతో దోహదం చేస్తాయని స్థానిక పోలీసు అధికారి యుసుఫ్‌ అబ్దుల్లా సలీం అన్నారు. అయితే, ఆ బ్యాగ్‌ ఎవరిదన్న దానిపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని