14 కిలోమీటర్లు.. డోలీలో తరలింపు

తాజా వార్తలు

Published : 05/10/2020 18:24 IST

14 కిలోమీటర్లు.. డోలీలో తరలింపు

విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలం టి.పొర్లు గ్రామానికి చెందిన కేరంగి చంద్రమ్మ ఎనిమిది నెలల గర్భిణి. ఆదివారం ఉదయం అస్వస్థతకు లోనుకాగా రవాణా సౌకర్యం లేక స్థానికులు దాదాపు 14 కిలోమీటర్ల దూరం దబ్బగుంట వరకు డోలీలో తీసుకెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్సులో ఎస్‌.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత విజయనగరం ఘోషాసుపత్రిలో చేర్చారు. గిరిజన గూడెంలలో కనీస రవాణా సౌకర్యాలు లేక అత్యవసర వైద్యానికి వారు పడుతున్న ఇబ్బందులకు నిదర్శనం ఈ దృశ్యం. ప్రస్తుతం చంద్రమ్మ ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు.

- న్యూస్‌టుడే, శృంగవరపుకోట గ్రామీణం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని