సచివాలయం కూల్చివేతలో జోక్యం చేసుకోలేం: ఎన్జీటీ

తాజా వార్తలు

Published : 20/07/2020 13:55 IST

సచివాలయం కూల్చివేతలో జోక్యం చేసుకోలేం: ఎన్జీటీ

దిల్లీ: తెలంగాణ సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై బెంచ్‌ ఇవాళ విచారణ చేపట్టింది.ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఉన్నందున కూల్చివేత జోలికి వెళ్లలేమని స్పష్టం చేసింది. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా సచివాలయం కూల్చివేస్తున్నారని రేవంత్‌ తన పిటిషన్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు పర్యావరణ కాలుష్యం, వ్యర్థాల నిర్వహణపై అధ్యయనానికి కేంద్ర పర్యావరణ శాఖ, సీపీసీబీ, తెలంగాణ పీసీబీ, ఐఐటీ హైదరాబాద్‌ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారనను సెప్టెంబర్‌ 25కి వాయిదా వేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని