రియా ఇంట్లో డ్రగ్స్‌ నిల్వచేసి, ఇచ్చేది: ఎన్సీబీ
close

తాజా వార్తలు

Published : 29/09/2020 19:23 IST

రియా ఇంట్లో డ్రగ్స్‌ నిల్వచేసి, ఇచ్చేది: ఎన్సీబీ

సుశాంత్‌ కేసులో నటి బెయిల్‌కు ఎన్సీబీ అభ్యంతరం
కోర్టులో అఫిడవిట్‌

ముంబయి: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసులో అరెస్టైన రియా చక్రవర్తి, షోవిక్‌కు బెయిల్‌ దరఖాస్తులపై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. నటుడికి డ్రగ్స్‌ సరఫరా చేయడంలో రియా హస్తం ఉందని పేర్కొంది. సుశాంత్‌ అనుమానాస్పద మృతి కేసులో రియాను పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకోగా.. డ్రగ్‌ కోణం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమెతోపాటు 16 మందిని ఎన్సీబీ అరెస్టు చేసింది. గత 3 మూడు వారాలుగా వీరు జైలులోనే ఉన్నారు. బెయిలు కోరుతూ ఇప్పటికే పలుమార్లు రియా దరఖాస్తు చేసుకోగా.. కోర్టు తిరస్కరించింది.

తాజాగా వారు వేసిన మరో దరఖాస్తును న్యాయస్థానం మంగళవారం పరిశీలించనుంది. ఈ నేపథ్యంలో ఎన్సీబీ అధికారులు స్పందించారు. వీళ్లు డ్రగ్స్‌ సరఫరా చేశారని, అది తీవ్రతరమైన నేరమని కోర్టుకు తెలిపారు. ఈ మేరకు 18 పేజీల అఫిడవిట్‌ను ఎన్సీబీ సమర్పించింది. ఎన్డీపీఎస్‌ చట్టం సెక్షన్‌ 27ఏ ప్రకారం రియాను అరెస్టు చేసినట్లు తెలిపింది. ఈ కేసులో సెక్షన్‌ 27ఏ (డ్రగ్స్‌ అక్రమ రవాణాకు ఆర్థిక సహాయం చేసినందుకు, నేరస్థులను ఆశ్రయించినందుకు శిక్ష) వర్తించదని రియా తరఫు న్యాయవాది సతీష్‌ మనేషిండే కోర్టులో పేర్కొన్నారు. దానికి సమాధానం ఇస్తూ ఎన్సీబీ కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది.

‘సుశాంత్‌ డ్రగ్‌ తీసుకుంటున్న విషయం రియాకు తెలుసు. అయినప్పటికీ అతడ్ని ఆశ్రయించింది. అంతేకాదు డ్రగ్స్‌ను తన ఇంట్లో నిల్వచేసి, సుశాంత్‌కు ఇచ్చేది. వాటిని అతడు తీసుకునేవాడు. మొబైల్‌ ఫోన్స్‌లోని వాట్సాప్‌ చాట్స్‌, ల్యాప్‌టాప్‌, ఇతర హార్డ్‌ డిస్కల్‌ వంటి ఎలక్ట్రానిక్‌ ఆధారాల్ని స్వాధీనం చేసుకున్నాం. అందులో డ్రగ్‌ కొన్నందుకు డబ్బులు చెల్లించిన ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. రియా, షోవిక్‌కు ముంబయిలోని డ్రగ్‌ సరఫరాదారులతో సంబంధాలు ఉన్నాయి. తమ వద్ద పనిచేసే సిబ్బంది సాయంతో డ్రగ్స్‌ తెప్పించేవారు, డబ్బులు చెల్లించేవారు. డ్రగ్స్‌కు డబ్బులు ఇచ్చారనే విషయం మాత్రం స్పష్టంగా తెలిసింది. దానర్థం వాళ్లు తీసుకున్నారని కాదు.. మరో వ్యక్తి కోసం తెప్పించారు. కాబట్టి ఎన్డీపీఎస్‌ సెక్షన్‌ 27ఏ ఈ కేసుకు వర్తిస్తుంది. వీరికి బెయిలు మంజూరు చేస్తే.. కేసు విచారణకు సమస్యలు ఏర్పడుతాయి’ అని ఎన్సీబీ కోర్టుకు విన్నవించినట్లు తెలిసింది.

దీనికి న్యాయవాది సతీష్‌ మనేషిండే స్పందిస్తూ.. సుశాంత్‌ సింగ్‌ మృతి కేసును ఎన్సీబీ విచారిస్తోందని, అది ఎన్డీపీసీ చట్టం కిందికి రాదని ఆరోపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని