పైడితల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన సంచయిత

తాజా వార్తలు

Published : 26/10/2020 10:10 IST

పైడితల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన సంచయిత

విజయనగరం: పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం వైభవంగా సాగుతోంది. జాతరలో భాగంగా మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌ సంచయిత గజపతిరాజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రతిఏటా మాన్సాస్‌ ట్రస్టు తరపున ఆ సంస్థ అధ్యక్షులు అమ్మవారిని దర్శంచుకొని పట్టువస్త్రాలు సమర్పించటం ఆనవాయితీ. మేళతాళాలు, పల్లకిలో పట్టు వస్త్రాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న సంచయితకు దేవాదాయశాఖ అధికారులు, ఆలయ పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి సంచయిత ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం సంచయిత గజపతి మాట్లాడుతూ.. ట్రస్టు అధ్యక్షురాలి హోదాలో తొలిసారిగా అమ్మవారిని దర్శంచుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఈ అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. అమ్మవారి చల్లని చూపులు, కరుణకటాక్షాలు అందరిపైనా ఉండాలని ఆకాంక్షించారు. కరోనా వైరస్‌ పూర్తిగా తొలగిపోయి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విజయనగరం ఎమ్‌ఆర్‌ కళాశాల ప్రైవేటీకరణ ప్రతిపాదనపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ఆమె నిరాకరించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని