TS News: ఆస్తి అమ్మి.. అన్నార్తుల ఆకలి తీర్చి
close

తాజా వార్తలు

Published : 31/05/2021 13:57 IST

TS News: ఆస్తి అమ్మి.. అన్నార్తుల ఆకలి తీర్చి

పాల్వంచలో యువకుడి ఔదార్యం

పాల్వంచ(కేటీపీఎస్‌), న్యూస్‌టుడే: లాక్‌డౌన్‌తో జనజీవనం స్తంభించిన వేళ.. తనవంతుగా అన్నార్తుల ఆకలి తీరుస్తూ, సాటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన ముక్తేవి గిరీశ్‌. తన ఇంటి స్థలాన్ని విక్రయించగా వచ్చిన రూ.10 లక్షలను ఇందుకోసం వెచ్చిస్తోండటం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం రెండోదశ లాక్‌డౌన్‌ను ప్రకటించగానే గిరీశ్‌ తన ఇంటి పేరుతో ‘ముక్తేవి ట్రస్టు’ను నెలకొల్పారు. స్నేహితులు రెడ్డిమల్ల మణికంఠ, బొందిలి హరి, సాయి, అఖిల్, ఫరీద్, శరత్, త్రిలోక్, వినయ్‌ను సభ్యులుగా చేర్చుకున్నారు. కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో కరోనా కష్టాలతో ఇంటికే పరిమితమైన బాధితులు, పూటగడవని పేదలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో తలదాచుకునే యాచకులు, వలస జీవులకు రోజుకు 700 మందికి భోజన పొట్లాలు అందజేస్తున్నారు. వాటిని అన్నార్తులకు చేర్చేందుకు యువకులైన స్వచ్ఛంద వాలంటీర్లు 200 మంది ముందుకు రావడం విశేషం. ఫోన్‌ చేసిన వారి వివరాలు నమోదు చేసుకుని భోజనం సమకూర్చుతున్నారు. పాల్వంచలోని అనుబోస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో వంటలు తయారు చేయిస్తున్నారు. ట్రస్టు సేవా కార్యక్రమాన్ని పాల్వంచ కమిషనర్‌ శ్రీకాంత్, ఐసీడీఎస్‌ అధికారులు పరిశీలించి అభినందించారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని