ప్రకాశం బ్యారేజీ వద్దకు కొట్టుకొచ్చిన పశువులు

తాజా వార్తలు

Published : 30/09/2020 12:13 IST

ప్రకాశం బ్యారేజీ వద్దకు కొట్టుకొచ్చిన పశువులు

విజయవాడ: ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద ప్రవాహంతో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వరద నీటిలో ప్రకాశం బ్యారేజీ వద్దకు కొన్ని పశువులు కొట్టుకొచ్చాయి. నది ఒడ్డున మేతకు వెళ్లిన దాదాపు పదికి పైగా గేదెలు ప్రమాదవశాత్తు నదిలో పడ్డట్టు తెలుస్తోంది. సమీపంలో గట్టు కనిపించకపోవడంతో ఎటూ వెళ్లలేని స్థితిలో పశువులు కొట్టుమిట్టాడాయి. ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో చూస్తుండగానే అవి వరదలో దిగువ ప్రాంతాలకు కొట్టుకుపోయాయి. రంగంలోకి దిగిన ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు పశువుల కోసం గాలింపు చేపట్టాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని