శిబు సోరెన్‌కు అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు

తాజా వార్తలు

Published : 25/08/2020 02:35 IST

శిబు సోరెన్‌కు అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు

రాంచీ: ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) అధినేత, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌ అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌ తేలడంతో హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. తాజాగా పరిస్థితి విషమించడంతో ఆయన్ను రాంచీలోని మేదాంత ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. 76 ఏళ్ల సోరెన్‌ గతంలో ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మూడు పర్యాయాలు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన తనయుడు హేమంత్‌ సోరెన్‌ ప్రస్తుతం ఝార్ఖండ్‌ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

శిబు సోరెన్‌తోపాటు ఆయన భార్య రూపి, వాళ్లింట్లో పని చేస్తున్న మరో ఏడుగురికి కూడా కరోనా పాజిటివ్‌ తేలింది. వీరంతా ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఝార్ఖండ్‌ ఆరోగ్యశాఖ మంత్రి బన్నా గుప్తాకు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటివరకు 30,000 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 318 మంది ప్రాణాలు కోల్పోయారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని