గట్టిగా మాట్లాడకండి.. కరోనా వస్తుంది..!

తాజా వార్తలు

Updated : 08/09/2020 17:51 IST

గట్టిగా మాట్లాడకండి.. కరోనా వస్తుంది..!

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌ శాసనసభలో వర్షాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సభలో గట్టిగా మాట్లాడవద్దని సభ్యులను ఉద్దేశించి స్పీకర్‌ విపిన్‌ సింగ్‌ చేసిన సూచనలు అందరినీ నవ్వించేలా చేశాయి. అసలు విషయం ఏంటంటే.. కరోనా వైరస్‌ దృష్ట్యా అసెంబ్లీకి వచ్చే సభ్యులందరికీ కొవిడ్‌ నిబంధనలపై స్పీకర్‌ సూచనలు చేశారు. సామాజిక దూరం, మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని చెప్పారు. అలా జాగ్రత్తలు చెప్పడంలో భాగంగా సభ్యులను గట్టిగా మాట్లాడవద్దని, అలా పెద్దగా వాదించడం ద్వారా కూడా కొవిడ్‌ సోకే ప్రమాదం ఉంటుందని చెప్పడంతో సభ్యులంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఈ దృశ్యం సభికులందరినీ ఆకట్టుకుంది. అయినప్పటికీ సభలో కొందరు సభ్యులు ప్రతిపక్షనేత ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై  చర్చించారు.

కాగా అసెంబ్లీ సమావేశాల్లో నిన్న పాల్గొన్న వారిలో రీటా దేవీ అనే ఎమ్మెల్యేకు సాయంత్రం పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ రావడం గమనార్హం. ప్రస్తుతం హిమాచల్‌ శాసనసభ్యుల్లో మంత్రి మహేందర్‌ సింగ్‌, రీటాదేవీ, లక్విందర్‌సింగ్‌ ముగ్గురు కొవిడ్‌ బారిన పడ్డారు. వారిని సభకు రాకుండా హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని స్పీకర్‌ సూచించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని