వైకుంఠ ఏకాదశి: లక్ష సర్వదర్శన టికెట్లు

తాజా వార్తలు

Published : 13/12/2020 02:00 IST

వైకుంఠ ఏకాదశి: లక్ష సర్వదర్శన టికెట్లు

తిరుమల: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఈ నెల 24 నుంచి పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో జవహర్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు 24 నుంచి రోజుకు 10 వేల చొప్పున లక్ష సర్వదర్శన టికెట్లను 5 కౌంటర్ల ద్వారా జారీ చేయనున్నట్లు ఈవో చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన డయల్‌ యువర్‌ ఈఓ కార్యక్రమంలో భాగంగా ఫోన్‌ ద్వారా భక్తుల సందేహాలు, సమస్యలకు ఈవో సమాధానం ఇచ్చారు. 26 పీఠాల అధిపతులు, ఆగమశాస్త్ర పండితుల ఏకాభిప్రాయంతోనే తిరుమలలో పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనానికి అవకాశం కల్పించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఈవో జహహర్‌ రెడ్డి వివరించారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లుపైబడిన వారిని దర్శనానికి అనుమతించకుండా విధించిన నిబంధనలను తితిదే తొలగించిన విషయం తెలిసిందే. స్వీయ నియంత్రణ, జాగ్రత్తలతో భక్తులు దర్శనం చేసుకోవాలని సూచించారు. వృద్ధులు, పిల్లలకు ప్రత్యేక క్యూలైన్లు లేవని.. ఎప్పటిలాగే దర్శనం చేసుకోవచ్చని స్పష్టం చేశారు. తిరుమలలో కార్తీకమాసంలో ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నామని.. అదే తరహాలో ధనుర్మాస విశిష్టతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఈవో వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని