పేదల కోసం ఆఫీసునే కొవిడ్‌ ఆసుపత్రిగా

తాజా వార్తలు

Published : 30/07/2020 02:53 IST

పేదల కోసం ఆఫీసునే కొవిడ్‌ ఆసుపత్రిగా

సూరత్‌ : కరోనా మహమ్మారిన బారిన పడిన వారి నుంచి ప్రైవేటు ఆసుపత్రులు అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. కరోనా చికిత్సకు లక్షల్లో బిల్లులు వేస్తున్నాయి. గుజరాత్‌లో ఓ వ్యాపారికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కొవిడ్‌-19 బారిన పడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అతడికి ఆ ఆస్పత్రి యాజమాన్యం లక్షల్లో బిల్లు వేసింది. ధనవంతుడినైన తన పరిస్థితి ఇలా ఉంటే.. మరి పేదల పరిస్థితి ఏంటి? అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఏకంగా తన కార్యాలయాన్నే ఆసుపత్రిగా మార్చారు.

సూరత్‌కు చెందిన వ్యాపారి ఖాదర్‌ షేక్‌ గత నెల కొవిడ్‌-19 బారిన పడ్డారు. 20 రోజుల చికిత్సకు లక్షల్లో బిల్లు వేయడంతో ఆశ్చర్యపోవడం అతడి వంతైంది. అంతమొత్తం పేదలు ఎలా భరించగలరు అన్న ప్రశ్నలోంచి అతడికి ఓ ఆలోచన వచ్చింది. స్థిరాస్తి వ్యాపారి అయిన అతడు తన 3వేల చదరపు మీటర్లు ఉండే కార్యాలయాన్ని ఆసుపత్రిగా మార్చారు. ఇందుకోసం స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. ఆస్పత్రి సిబ్బంది, మందుల ఖర్చు ప్రభుత్వం భరించేలా.. బాధితులకు అవసరమైన మంచాలు, పరుపులు, విద్యుత్‌ ఖర్చు తాను భరిస్తానని హామీ ఇచ్చారు. 85 మందికి చికిత్స అందించేలా ఆ ఆసుపత్రిని తీర్చిదిద్దారు.

ఈ ఆస్పత్రి అందరి కోసమని, కులం, మతం అన్న వివక్షకు తావులేదని చెబుతున్నారు ఈ 63 ఏళ్ల వ్యాపారి. తానేమీ పుట్టుకతో ధనవంతుడిని కాదని.. తానూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాని చెప్పుకొచ్చారు. అందుకే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తోటి మనుషులకు సాయపడేందుకు ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లు ఖాదర్‌ షేక్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని