బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో అనుమానితుడికి బెయిల్‌

తాజా వార్తలు

Published : 25/11/2020 23:53 IST

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో అనుమానితుడికి బెయిల్‌

ముంబై: సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత బాలీవుడ్‌లో డ్రగ్స్ రాకెట్‌ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ, ఎన్సీబీ దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ ప్రముఖులకు డ్రగ్స్‌ అందించడంలో కీలకంగా ఉన్న కరమ్‌జీత్ ‌సింగ్ ‌ఆనంద్‌ను ఎన్సీబీ అరెస్టు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై ముంబై న్యాయస్థానం బుధవారం అతడికి బెయిల్‌ మంజూరు చేసింది.  తమకు సమాచారం లేకుండా దేశం దాటి బయటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. బెయిల్‌ సమయంలో సాక్ష్యులను ప్రభావితం చేయడం కానీ, కేసు విచారణకు భంగం కలిగించకూడదని ఆదేశించారు. బాలీవుడ్‌ డ్రగ్‌ రాకెట్‌లో ఆనంద్‌ కీలక సూత్రధారి అని ఎన్సీబీ గతంలో కోర్టుకు నివేదించింది.  సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ స్నేహితురాలు, బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్, సుశాంత్‌ పనివాళ్లను కొందరిని గతంలో ఎన్సీబీ అరెస్టు చేసింది. వారిలో చాలామంది ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని