‘ఏపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది’

తాజా వార్తలు

Updated : 28/08/2020 18:06 IST

‘ఏపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది’

ఎన్జీటీలో తెలంగాణ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై విచారణ

దిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై బెంచ్‌లో విచారణ జరిగింది. ఈ పథకానికి పర్యావరణ అనుమతులు లేవంటూ తెలంగాణకు చెందిన గవినోల శ్రీనివాస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్జీటీ విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచంద్రరావు వాదనలు వినిపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు అవసరమని ఆయన వాదించారు. ప్రాజెక్టు సామర్థ్యం 40వేల క్యూసెక్కుల నుంచి 80వేలకు రెట్టింపు చేశారని ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. పర్యావరణ అనుమతులు అవసరం లేదంటూ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టాలని కోరారు. నిపుణుల కమిటీ ఏపీ చెప్పినదాన్నే విని ఏకపక్షంగా నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. 

అవసరమైతే నిపుణుల కమిటీ సభ్యులను హెలికాప్టర్‌లో తీసుకెళ్లి ప్రాజెక్టును చూపెడతామని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ తెలిపారు. ప్రాజెక్టులో భారీ మార్పులు చేసి.. ఇంతముందు ఉన్నదే అంటూ ఏపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. తెలంగాణకు ఇది జీవన్మరణ సమస్య అని.. రాయలసీమ ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని పెంచితే రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఎన్జీటీ ముందు వాదించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సుమారు రెండు గంటల పాటు ఆయన వాదనలు వినిపించారు. అనంతరం తదుపరి విచారణను ఎన్జీటీ సెప్టెంబర్‌ 3కి వాయిదా వేసింది.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని