‘ప్లాట్ల రిజిస్ట్రేషన్‌పై వివరణ ఇవ్వండి’

తాజా వార్తలు

Published : 24/09/2020 17:21 IST

‘ప్లాట్ల రిజిస్ట్రేషన్‌పై వివరణ ఇవ్వండి’

తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు

హైదరాబాద్‌: అక్రమ లే అవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గత నెల 26న రిజిస్ట్రేషన్ల శాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ న్యాయవాది గోపాల్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డి ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఆకస్మికంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం రాజ్యాంగ విరుద్దమని పిటిషనర్‌ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం అక్టోబరు 14లోపు పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్‌ 15కి వాయిదా వేసింది. 
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని