ఎస్పీబీ మృతికి తెలంగాణ మంత్రులు సంతాపం

తాజా వార్తలు

Updated : 25/09/2020 18:04 IST

ఎస్పీబీ మృతికి తెలంగాణ మంత్రులు సంతాపం

హైదరాబాద్: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు సంతాపం తెలిపారు. ఎస్పీబీ మృతి విచారకరమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆలపించిన వేల పాటల ద్వారా ప్రజల మనసుల్లో ఆయన సుస్థిరంగా నిలిచారని కొనియాడారు. బాలు మృతి సినీ ప్రపంచానికి, సంగీత అభిమానులకు తీరని లోటని చెప్పారు. 

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం దురదృష్టకరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సినీలోకానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని చెప్పారు. అనేక భాషల్లో పాటలు పాడి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారని హరీశ్‌ కొనియాడారు. బాలు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. ఎస్పీబీ మృతిపై మంత్రులు ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పువ్వాడ అజయ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, గంగుల కమలాకర్‌, సత్యవతి రాఠోడ్‌, మల్లారెడ్డి సంతాపం వక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని