సచివాలయం కూల్చివేతపై ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో విచారణ

తాజా వార్తలు

Published : 16/07/2020 15:26 IST

సచివాలయం కూల్చివేతపై ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో విచారణ

చెన్నై: తెలంగాణ సచివాలయం కూల్చివేతపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై బెంచ్‌లో విచారణ జరిగింది. సచివాలయం కూల్చివేత పర్యావరణానికి సంబంధించిన విషయం అయినందువల్ల ఎన్జీటీలో విచారణ చేపట్టాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పర్యావరణశాఖలను ప్రతివాదులుగా చేర్చారు. పర్యావరణ అనుమతులు రాకుండానే కూల్చివేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరించారు.దీనిపై స్పందించిన ఎన్జీటీ.. హైకోర్టులో విచారణ తర్వాత వాదనలు వింటామని చెప్పింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని