శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌కు పాఠశాల విద్యార్థుల వినూత్న విజ్ఞప్తి

తాజా వార్తలు

Published : 25/08/2021 01:28 IST

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌కు పాఠశాల విద్యార్థుల వినూత్న విజ్ఞప్తి

సంతబొమ్మాళి: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జిల్లా కలెక్టర్‌కు వినూత్నంగా విజ్ఞప్తి చేశారు. తాము ఆడుకునే మైదానంలో కోల్డ్‌ స్టోరేజీ నిర్మాణం చేయాలనుకుంటున్నారని, ఆ ప్రతిపాదన ఆపాలంటూ కలెక్టర్‌కు వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. సంతబొమ్మాళి పంచాయతీలోని ప్రభుత్వ భూమిని కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి అధికారులు కేటాయించారు. దీంతో విద్యార్థులు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తమకు ఉన్న ఏకైక మైదానంలో కోల్డ్‌ స్టోరేజీ వద్దని వీడియో ద్వారా కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.  Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని