వైరస్‌ను జయించినా.. మనోవేదన బలి తీసుకుంది

తాజా వార్తలు

Published : 20/09/2020 07:17 IST

వైరస్‌ను జయించినా.. మనోవేదన బలి తీసుకుంది

నారాయణఖేడ్‌ : ఆ పెద్దాయన 75 ఏళ్ల వయసులో కరోనాని జయించారు. కానీ.. భార్య, కుమారుడు గత నెలలో ఒకే రోజు కరోనాతో చనిపోవడం ఆయనను తీవ్రంగా కలచివేసింది. అప్పటి నుంచి తీరని మనోవేదనను అనుభవిస్తున్న ఆ కుటుంబ పెద్ద శుక్రవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం అంబోజీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 45 రోజుల క్రితం యజమాని సహా ఆ ఉమ్మడి కుటుంబంలోని 8 మందికి కరోనా సోకింది. అందరూ హోం క్వారంటైన్‌లోనే ఉండగా.. గత నెల 12న కొన్ని గంటల వ్యవధిలో తల్లీకుమారుడు మృతి చెందారు. అప్పట్లో కరోనా నుంచి కోలుకున్న ఆ కుటుంబ పెద్ద శుక్రవారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం పొందారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని