వేలేరుపాడు అడవుల్లో పెద్దపులి సంచారం

తాజా వార్తలు

Published : 28/12/2020 06:02 IST

వేలేరుపాడు అడవుల్లో పెద్దపులి సంచారం

వేలేరుపాడు: పశ్చిమగోదావరి జిల్లాలో వేలేరుపాడు అడవుల్లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. తెలంగాణలోని అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల అటవీ ప్రాంతంలో కొన్నిరోజుల క్రితం పెద్దపులి సంచరించి ఆవు, దూడను చంపేసింది. అనంతరం సమీపాన ఉన్న వేలేరుపాడు మండలంలోని గుండ్లమడుగు, ఎడవల్లి, బోళ్లపల్లి గ్రామాల సమీపంలో పులి సంచరిస్తుండటంతో ఆయా గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. 

అటవీశాఖ అధికారులు పులి సంచారంపై ఆదివారం తనిఖీలు నిర్వహించగా పాదముద్రలు కనిపించాయి. ఈ విషయంపై కుక్కునూరు రేంజ్‌ అధికారి ఏడుకొండలు ‘న్యూస్‌టుడే’ తో మాట్లాడుతూ..మండలంలోని అటవీ ప్రాంత పరిధిలోని గ్రామాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇవీ చదవండి..

‘మాట్లాడేందుకు వస్తే కత్తులు,కొడవళ్లు ఎందుకు?’

నియంత్రిత సాగుపై ప్రభుత్వం కీలక నిర్ణయం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని