ఒకే కుటుంబంలో 12 మందికి కరోనా

తాజా వార్తలు

Published : 18/07/2020 18:34 IST

ఒకే కుటుంబంలో 12 మందికి కరోనా

అమీన్‌పూర్: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన 12మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ సుజాత తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో నివాసముండే ఓ వ్యక్తి నాలుగు రోజులుగా గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతున్నాడు. ఉమ్మడి కుటుంబం కావడంతో ఇంట్లో వారందరికీ జ్వరాలు వచ్చాయి.  కరోనా సోకిందనే అనుమానంతో శనివారం మదీనగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు 14 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 12మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కమిషనర్‌ సుజాత సిబ్బందితో వెళ్లి కాలనీలో రసాయనాలతో శుద్ధి చేశారు. స్థానికులంతా జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. ఒకే కుటుంబంలో 12 మందికి కరోనా రావడంతో స్థానికులంతా భయాందోళనలో ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని