శునకంపై దాడి.. మండిపడుతున్న నెటిజన్లు

తాజా వార్తలు

Published : 22/12/2020 14:54 IST

శునకంపై దాడి.. మండిపడుతున్న నెటిజన్లు

‘జస్టిస్‌ ఫర్‌ బడ్డీ’ పేరుతో ట్రెండ్‌ అవుతున్న పోస్టులు

నొయిడా: పెంపుడు శునకంపై దాడి చేసిన ఓ ఐటీ ఉద్యోగిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. నొయిడాకు చెందిన ఐటీ ఉద్యోగి రిషబ్‌ మెహ్రా తన పెంపుడు శునకం (బడ్డీ)పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో బడ్డీకి గాయాలయ్యాయి. కాలి ఎముక,‌ కొన్ని దంతాలు విరిగిపోయాయి. శునకం అరుపులు విన్న ఓ వ్యక్తి ఆ దాడిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. శునకానికి న్యాయం జరగాలని, యజమానిని శిక్షించాలని కోరుతున్నారు. ఘటనపై భాజపా నేత, పీపుల్‌ ఫర్‌ యానిమల్స్‌ (పీఎఫ్‌ఏ) వ్యవస్థాపకురాలు మనేకా గాంధీ స్పందించారు. మెహ్రాపై కేసు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 

అయితే ఇప్పటిక వరకు యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అతడిని శిక్షించాలని, ‘జస్టిస్‌ ఫర్‌ బడ్డీ’ అనే హాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అతడు ఉద్యోగానికి అర్హుడు కాదని, సంస్థ యాజమాన్యం అతడిని విధుల్లో నుంచి వెంటనే తొలగించాలని నెటిజన్లు కోరుతున్నారు. పోలీసులు అతడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మెహ్రాను ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని మనేకా గాంధీ ఆరోపించారు. అతడిపై చర్యలు తీసుకోకపోతే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సినీనటి రిచా చద్దా సైతం స్పందించారు. అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని కోరారు. అలాంటి వ్యక్తి మీ సంస్థకు అవసరమా అని ప్రశ్నించారు.

ఇవీ చదవండి...

నవ వధువుపై భర్త పైశాచికత్వం!

పెళ్లిపీటలు ఎక్కకుండానే ప్రాణాలు పోయాయ్‌





Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని