మరీ ఇంత ప్రేమా? విడాకులు ఇప్పించండి ప్లీజ్‌!

తాజా వార్తలు

Updated : 22/08/2020 16:41 IST

మరీ ఇంత ప్రేమా? విడాకులు ఇప్పించండి ప్లీజ్‌!

లఖ్‌నవూ: భర్త తనపై ప్రేమ చూపించడం లేదని విడాకులు తీసుకునే వారిని చూసుంటాం. తరచూ గొడవ పడుతున్నాడని విడిపోవాలని అనుకుంటున్న వారి గురించి విని ఉంటాం. అయితే ఈ యూపీ మహిళ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఈమె విడాకుల కోసం చెప్పిన కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

తన భర్త తనపై నిత్యం ప్రేమ కురిపించాలని ఏ మహిళైనా కోరుకుంటుంది. అయితే ఈ మహిళ మాత్రం ప్రేమ మరీ ఎక్కువైందని తన భర్త నుంచి విడాకులు అడుగుతోంది. తనతో గొడవ పడట్లేదని విడిపోవాలని కోరుకుంటోంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళకు 18 నెలల క్రితం వివాహమైంది. ఆ భర్త ఆమెను అపురూపంగా చూసుకుంటున్నాడు. ఆమెను సంతోషపెట్టేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటాడు. అయితే ఇదే వారిద్దరి మధ్య అసలు సమస్యగా మారింది. తనపై చూపిస్తున్న అతి ప్రేమను తట్టుకోలేకపోతున్నానని ఆమె ఏకంగా విడాకులు కావాలని స్థానిక షరియా కోర్టును ఆశ్రయించింది.

‘నాకు ఇంటి పనుల్లో సహాయపడతాడు. వంట చేసి పెడతాడు. ఏదైనా తప్పు చేస్తే వెంటనే క్షమిస్తాడు. నాపై ఎప్పుడూ కోప్పడడు. కానీ.. నాకు అతడితో గొడవపడాలని ఉంటుందిగా. ఇంత ప్రేమను భరించలేను. ఇలాంటి వాతావరణంలో నేను ఇమడలేకపోతున్నా’ అంటూ ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆమె చెప్పిన కారణం విని ఆమె పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ సమస్యను భార్యభర్తలే చర్చించి పరిష్కరించుకోవాలని సూచించింది. దీంతో ఆమె స్థానిక పంచాయితీ పెద్దలనూ ఆశ్రయించింది. వారు కూడా అంత ప్రేమగా చూసుకునే భర్తతో ఎందుకు విడిపోతావని చెప్పి పంపించివేసినట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని