కరోనా టీకా .. సిద్ధమంటున్న యూపీ
close

తాజా వార్తలు

Published : 14/11/2020 01:27 IST

కరోనా టీకా .. సిద్ధమంటున్న యూపీ

వ్యాక్సిన్‌ నిల్వకు సన్నాహాలు మొదలు

లఖ్‌నవూ: త్వరలోనే అందుబాటులోకి రాగలదని భావిస్తున్న కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను నిల్వ చేసేందుకు యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం అప్పుడే సన్నద్ధమౌతోంది. రాష్ట్ర ప్రజలందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిచనున్నట్టు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ రాష్ట్రానికి కరోనా టీకా ఎంత పరిమాణంలో లభించేదీ కచ్చితంగా తెలీదని.. అయితే దాని నిల్వకు తగిన మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉండటం అత్యవసరమని ఆ రాష్ట్ర ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ ఏపీ చతుర్వేది అభిప్రాయపడ్డారు. ఇందుకు గాను రాష్ట్రంలోని 22 జిల్లాల్లో నూతన గిడ్డంగులను నిర్మిస్తుండగా.. మరో 27 జిల్లాల్లో ఇప్పటికే ఉన్నవాటికి అవసరమైన మరమ్మతు పనులు చేపడుతున్నామని ఆయన వివరించారు. రాజధాని లఖ్‌నవూలో మూడు డిపోలను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారి తెలిపారు.

అతిశీతల ఉష్ణోగ్రత వద్ద వ్యాక్సిన్‌ నిల్వ ఉంచే కోల్డ్‌ చైన్‌ వ్యవస్థ నిర్వహణపై దృష్టి కేంద్రీకృతం చేస్తున్నట్టు ఉన్నతాధికారులు ప్రకటించారు. డిసెంబర్‌ 15 కల్లా కరోనా వ్యాక్సిన్‌ డిపోలు సిద్ధం కాగలవని వారు ధీమా వ్యక్తం చేశారు. తొలుత వైద్య, ఆరోగ్య సిబ్బందికి తొలివిడత వ్యాక్సిన్‌ అందుతుందని అధికారులు వివరించారు. అంతేకాకుండా టీకాలు వేసేందుకు అర్హలైన వారి రాష్ట్రస్థాయి జాబితాలు ఇప్పటికే సిద్ధమైనట్టు వారు తెలిపారు. బిహార్‌లో తాము అధికారంలోకి వస్తే వ్యాక్సిన్‌ ఉచితంగా అందిస్తామని ఎన్డీయే హామీ ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వం సైతం ఉచిత వ్యాక్సిన్‌ను అందిస్తామని ప్రకటించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని