పీవీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు: ఉత్తమ్‌

తాజా వార్తలు

Published : 24/07/2020 16:11 IST

పీవీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు: ఉత్తమ్‌

హైదరాబాద్‌: రాష్ట్రానికి, దేశానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్‌ కొనియాడింది. తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో గాంధీభన్‌లో పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభించారు. ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ గీతారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పీవీపై డాక్యుమెంటరీ విడుదల చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తదితరులు పీవీ సేవలను కొనియాడుతూ.. వీడియో ద్వారా సందేశమిచ్చారు. పీవీ ఎన్నటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘ పీవీ నాకు వ్యక్తిగతంగానూ పరిచయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో  భూ సంస్కరణలు తీసుకొచ్చి, లక్షల మందికి న్యాయం చేశారు. ఆయన జీవితాంతం కాంగ్రెస్‌ వాది’’ అని ఉత్తమ్‌ అన్నారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని