బాబా కా దాబా తరహాలో మరో వీడియో వైరల్‌ 

తాజా వార్తలు

Updated : 11/10/2020 13:26 IST

బాబా కా దాబా తరహాలో మరో వీడియో వైరల్‌ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీలోని బాబాకా దాబా వీడియో వైరల్‌గా మారి వృద్ధ దంపతుల కన్నీటిని తుడిచిన తరహా ఘటన ఆగ్రాలోనూ చోటుచేసుకుంది. కరోనా కారణంగా వ్యాపారం దెబ్బతిని ఇబ్బందులు పడుతున్న ఓ వృద్ధుడిని నెటిజన్లు ఆదుకున్నారు. ఆగ్రాలో కాంజీ బడా పేరుతో చిరుతిళ్ల వ్యాపారం నిర్వహిస్తున్న 90 ఏళ్ల నారాయణ్‌సింగ్‌ కొవిడ్‌ కారణంగా సంపాదన కోల్పోయారు. అయితే స్థానికంగా ఉండే ధన్షిత అనే యువతి దిల్లీలోని బాబా కా దాబా తరహాలోనే ఓ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది. ఈ వీడియో వైరల్‌ కావడంతో ఆగ్రా వాసులు కాంజీ బడా బండిని సందర్శిస్తున్నారు. ఆగ్రా జిల్లా మెజిస్ట్రేట్‌ ప్రభు ఎన్సింగ్‌ కూడా కాంజీ బండిని సందర్శించారు. తనకు గిరాకీ పెరగడంతో ఆ బండి నడుపుతున్న నారాయణ్‌సింగ్‌ ఆనందం వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నానని, కరోనాతో బతుకుదెరువు కోల్పోయానని అన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా మళ్లీ తనకు గిరాకీ పెరగడం ఆనందంగా ఉందన్నారు. బాబా కా బాదా వీడియో స్ఫూర్తితో తాను కూడా ఈ వీడియోని సోషల్‌ మీడియాలో పోస్టు చేసినట్లు ధన్షిత తెలిపింది.
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని