పల్లెకోసం పనిచేసే రక్షక దళాలు!

తాజా వార్తలు

Updated : 22/11/2020 20:57 IST

పల్లెకోసం పనిచేసే రక్షక దళాలు!

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఎక్కడైనా నేరాలు జరిగితే స్పందించి చర్యలు తీసుకోవటం పోలీసుల విధి. అసలు అలాంటివి జరగక ముందే చర్యలు తీసుకుంటే.. ఇంకా ఎంతో మేలు జరుగుతుంది. సరిగ్గా అదే ఆలోచించారు ఆ పోలీసులు. అందుకోసం సరికొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ప్రజలను భాగస్వాములుగా చేర్చుకున్నారు. ఆ పోలీసులు చేస్తున్న ఆ ఆసక్తికర ప్రయత్నం వివరాల్లోకి వెళితే...!

ప్రజల భాగస్వామ్యంతో నేరాలను అరికట్టాలన్న లక్ష్యంతో గుంటూరు అర్బన్‌ పోలీసులు ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా యువకులు, ఔత్సాహికులతో గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఏం జరుగుతోంది, ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తున్నారా వంటి విషయాలను ఈ రక్షక దళాల్లో ఉన్నవారు పోలీసులకు చేరవేస్తారు. గ్రామ సచివాలయాల్లో పోలీసులుగా వ్యవహరిస్తున్న వారితో వీరు అనుసంధానమై ఉంటారు. వీరికి ఎలాంటి వేతనాలు, ప్రోత్సాహకాలు ఉండవు. పుట్టిన ఊరిపై ప్రేమతో చాలామంది ఈ రక్షక దళాల్లో పనిచేయటానికి ముందుకు వస్తున్నారు. అయితే వర్గాలు, వివాదాలకు దూరంగా ఉండేవారినే ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు పోలీసులు. వీరికి భవిష్యత్తులో హోంగార్డుల నియామకం వంటి వాటిల్లో ప్రాధాన్యం ఇస్తారట. వట్టి చెరుకూరు మండలంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రక్రియను ఫలితాల ఆధారంగా మిగిలిన చోట్లకు విస్తరించాలని భావిస్తున్నారు. ఈ దళాలు బాగా పనిచేస్తే ఘర్షణలు, నేరాలకు తావులేని వాతావరణం ఏర్పడుతుందని ఆశిస్తున్నారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని