చలిపులి పంజా విసరొద్దంటే!  

తాజా వార్తలు

Published : 03/12/2020 20:44 IST

చలిపులి పంజా విసరొద్దంటే!   

ఇంటర్నెట్‌ డెస్క్‌ : చలికాలంలో వాతావరణంలో వచ్చే మార్పులు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ కాలంలో సాధారణంగానే జలుబు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలు వేధిస్తుంటాయి. చర్మం పాడవటం, కీళ్లు బిగుసుకుపోవటం తదితరాలు ఎదురవుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో... ఈ సీజన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుని, చలిపులిపై మనమే పంజా విసురుదాం!

ఈ కాలంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే జీవన శైలిలో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం. శీతల గాలికి చర్మం పొడిబారి పగుళ్లు వచ్చి దురద పెడుతుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే రాత్రిపూట పడుకునే ముందు చర్మానికి కొబ్బరి, ఆలివ్‌ నూనె వంటివి రాసుకోవాలి. చల్లగాలికి ఎక్కువగా తిరగకూడదు. బయటకు వెళ్లాల్సి వస్తే దుస్తులు నిండుగా ధరించటం, స్వెట్టర్‌ వంటివి వేసుకోవటం మంచిది. 

ఆస్తమాతో ఇబ్బంది పడుతున్న వారు ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు తగినంత వేడి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. జలుబు, దగ్గు వంటివి దరిచేరకుండా ఉండటం కోసం వేడి నీటితో ఆవిరి పట్టుకోవాలి. పాలలో కాసింత మిరియాల పొడి కలుపుకొని తాగాలి. ఇలా చేయటం వల్ల దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చలికాలంలో కీళ్లన్నీ బాగా బిగుసుకుపోయి కదలికల్ని కష్టంగా మారుస్తాయి. ఈ సమస్యను నివారించుకునేందుకు కీళ్లను తరచూ కదిలిస్తూ ఉండాలి. సమయానుకూలంగా ఏదో ఒక వ్యాయామం చేయాలి. కాసేపు అటుఇటు నడవటం వల్ల కీళ్లకు మంచి వ్యాయామం దొరుకుతుంది. నొప్పుల నుంచి ఉపశమనమూ లభిస్తుంది. చలికాలంలో దాహం వేయకున్నా తరచుగా నీరు తాగాలి. ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గితే జీర్ణక్రియ మందగిస్తుంది. జీవక్రియారేటు కూడా పడిపోతుంది. ఆహారం వేడివేడిగా, తాజాగా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించటం వల్ల చలిపులికి చెక్‌ పెట్టొచ్చు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని