‘లూడో’లో మోసం చేశాడని కోర్టుకెక్కిన యువతి

తాజా వార్తలు

Published : 28/09/2020 01:26 IST

‘లూడో’లో మోసం చేశాడని కోర్టుకెక్కిన యువతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: లాక్‌డౌన్‌ కాలంలో ఆన్‌లైన్‌ ఆటలకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. ఇద్దరి నుంచి నలుగురు ఆడుకునే ‘లూడో’ ఆట కూడా విపరీతంగా పాపులర్‌ అయ్యింది. అయితే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ 24 ఏళ్ల యువతి లూడో ఆటలో తండ్రి మోసం చేశాడంటూ కోర్టు మెట్లెక్కింది. గెలిపిస్తాడని నమ్మానని, కానీ తన పావుల్నే చంపేశాడని.. తండ్రితో తన సంబంధాన్ని తెంచేయాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తోబుట్టువులు, తండ్రితో ఆడిన ఆటలో తండ్రి తనను గెలిపిస్తాడని భావించానని.. ఆ నమ్మకాన్ని వమ్ము చేశాడంటూ కోర్టుకు తెలిపింది. తనలో సంతోషాన్ని నింపేందుకు ఆయన ఓడిపోయి నన్ను గెలిపిస్తాడని నమ్మకం పెట్టుకున్నానని, కానీ అలా చేయలేదని పేర్కొంది. దీంతో తండ్రిపై ఉన్న గౌరవమంతా పోయిందని, ఆయనతో ఉన్న బంధాన్ని తెంచుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించింది. సదరు యువతి ఫిర్యాదుపై ఫ్యామిలీ కోర్టు కౌన్సెలర్‌ సరిత స్పందించారు. ఆ యువతికి కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు వెల్లడించారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని