చరవాణి వెలుతురులో గర్భిణికి ప్రసవం!

తాజా వార్తలు

Updated : 13/11/2020 04:19 IST

చరవాణి వెలుతురులో గర్భిణికి ప్రసవం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటకలో ఓ ఆసుపత్రి వైద్యులు పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన మహిళకు చరవాణి వెలుతురులో ప్రసవం చేశారు. సిద్దమ్మ అనే మహిళ ప్రసవ వేదనతో కలబురిగిలోని కండూరులో స్థానిక ఆసుపత్రికి వచ్చారు. మహిళ ఆసుపత్రికి వచ్చే సమయానికి ఆ ప్రాంతంలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. తప్పని పరిస్థితుల్లో వైద్యులు చరవాణి టార్చి వెలుతురులోనే ప్రసవం చేయగా ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆసుపత్రిలో పవర్‌ బ్యాకప్‌ అవకాశం లేకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి సరైన ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులను కోరారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని