ఒక్కడే.. 30 ఏళ్లు.. 3కి.మీ కాలువ

తాజా వార్తలు

Published : 14/09/2020 01:04 IST

ఒక్కడే.. 30 ఏళ్లు.. 3కి.మీ కాలువ

మాంఝీని తలపించిన బిహార్‌ వాసి

గయా: ఏళ్లపాటు గుట్టను తవ్వి రోడ్డు నిర్మించిన దశరథ్‌ మాంఝీ తరహాలో బిహార్‌కి చెందిన ఓ వ్యక్తి 30 ఏళ్లు కష్టపడి ఓ కాలువను తవ్వాడు. బిహార్‌లోని గయాకు చెందిన ఓ వ్యక్తి తన గ్రామంలోని పంట పొలాలకు నీటిని మళ్లించటం కోసం 30 ఏళ్లు కష్టపడి 3 కిలోమీటర్ల కాలువ తవ్వాడు. జిల్లా కేంద్రానికి 80 కి.మీ. దూరంలో ఉన్న కోతిలావ గ్రామంలో నివసించే లంగీ భుయాన్‌ ఈ కాలువ నుంచి నీటిని గ్రామంలోని కుంటలోకి వెళ్లేలా ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచి నీరు పంటపొలాలకు చేరుతోంది. దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఈ ఊరికి మావోయిస్టులకు ఆశ్రయం ఇచ్చే ప్రదేశంగానూ పేరుంది. వర్షాకాలంలో తన ఊరి చుట్టూ ఉన్న కొండల మీద పడిన వర్షం వృథాగా నదుల్లో కలవడం చూసిన భుయాన్‌ కాలువ తవ్వడానికి నిర్ణయించుకున్నాడు. తనకున్న పశువులను నిత్యం మేతకు తీసుకెళ్లే భుయాన్‌ అవి మేసే సమయంలో కాలువను తవ్వేవాడు. గ్రామస్థులందరూ బతుకుదెరువు కోసం నిత్యం సమీప పట్టణాలకు వెళ్తుంటే ఊరినే నమ్ముకొని జీవిస్తున్న భుయాన్‌ ఈ క్రతువులో తనకు ఎవరూ సాయం చేయలేదంటున్నాడు. ఇతడి వల్ల వందలాది పశువులకు తాగునీరు, పొలాలకు సాగునీరు అందుతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని