కలెక్టర్ గారూ.. నా బిడ్డ ప్రాణాలు కాపాడండి
close

తాజా వార్తలు

Published : 09/05/2021 13:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కలెక్టర్ గారూ.. నా బిడ్డ ప్రాణాలు కాపాడండి

మామిడికుదురు: కరోనా మహమ్మారి దుర్భర పరిస్థితులకు దారితీస్తోంది. బాధితులతో ఆసుపత్రులు నిండిపోవడంతో మరికొందరు దిక్కుతోచని స్థితిలో నరకయాతన అనుభవిస్తున్నారు. తమను కాపాడాలంటూ అర్థిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా సోకి ప్రాణాపాయంతో  సతమతమవుతున్న తన ఏడు నెలల బిడ్డను బతికించాలంటూ  ఓ తల్లి కన్నీటితో కలెక్టర్‌ను వేడుకొంది. మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామానికి చెందిన మహిళ తనతో పాటు తన కుమారుడుకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపింది.  కుమారుడిని  చేర్చుకోవాలంటూ మూడు రోజుల నుంచి ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఎవరు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. నా బిడ్డ ప్రాణాలు కాపాడండి కలెక్టర్ గారూ.. అంటూ కన్నీటితో తల్లి వేడుకొంటున్న వీడియో కంటతడి పెట్టిస్తోంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని