Ts News: సమగ్ర క్రీడాభివృద్ధిని సాధించే దిశగా నూతన క్రీడా విధానం

తాజా వార్తలు

Published : 20/09/2021 20:43 IST

Ts News: సమగ్ర క్రీడాభివృద్ధిని సాధించే దిశగా నూతన క్రీడా విధానం

హైదరాబాద్‌: రాష్ట్రంలో సమగ్ర క్రీడాభివృద్ధిని సాధించే దిశగా నూతన క్రీడా విధానాన్ని ప్రకటించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర క్రీడా, అబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వెల్లడించారు. ఇందులో భాగంగా అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించటానికి వివిధ దేశాల క్రీడా పాలసీలను అధ్యయనం చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో క్రీడలను ప్రోత్సహించి అగ్రశ్రేణి క్రీడా దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలనే ఆకాంక్షపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ సింగ్ ఠాకూర్‌ అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాలకు చెందిన క్రీడాశాఖల మంత్రులతో నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా హబ్‌గా రూపొందించేందుకు సీఎం కేసీఆర్‌ కేబినేట్‌ సబ్‌ కమిటీని నియమించిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఉద్యోగాల్లో 2, ఉన్నత విద్య కోసం 0.5 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టామన్నారు. అదే విధంగా ఖేలో ఇండియా కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఖేలో ఇండియా పోటీల్లో తెలంగాణ నుంచి 219 మంది క్రీడాకారులు పాల్గొని 53 పతకాలను సాధించారని మంత్రి వివరించారు. మెదక్‌, కరీంనగర్‌, వరంగల్‌లో 400 మీటర్ల సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌ను కేంద్ర క్రీడా శాఖ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మహబూబ్‌ నగర్‌లో సింథటిక్‌ ట్రాక్‌ నిర్మాణం కోసం రూ.7.50 కోట్లు, సిద్ధిపేటలో మల్టీపర్పస్‌ స్టేడియం నిర్మాణం కోసం రూ.10 కోట్ల ప్రాధాన్యత ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామన్నారు. వీటితోపాటు అంతర్జాతీయ ప్రమాణాలైన షూటింగ్‌ రేంజ్‌, ఆక్వాటిక్స్‌, బ్యాడ్మింటన్, రెండు సింథటిక్‌ ట్రాక్స్‌, రెండు అస్ట్రోటర్ఫ్‌ హాకీ గ్రౌండ్స్‌తో పాటు క్రీడా మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.52 కోట్లను మంజూరు చేయాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించిందని వెంటనే వాటిని ఆమోదించాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని