పని ఒత్తిడి.. వైద్యుడి చెంప చెళ్లుమనిపించిన నర్సు

తాజా వార్తలు

Updated : 27/04/2021 15:59 IST

పని ఒత్తిడి.. వైద్యుడి చెంప చెళ్లుమనిపించిన నర్సు

రాంపూర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వైద్యుడు, నర్సు ఘర్షణకు దిగి పరస్పరం దాడి చేసుకున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రాంపూర్‌ జిల్లా ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నారని.. పనిభారంతో ఒత్తిడి పెరిగి వారిద్దరూ వాగ్వాదానికి దిగినట్లు అధికారులు పేర్కొన్నారు. డాక్టర్‌తో ఘర్షణకు దిగిన నర్సు.. అతడి చెంప చెళ్లుమనిపించింది. ఆ వైద్యుడు కూడా నర్సుపై దాడి చేసేందుకు యత్నించగా పక్కనే ఉన్న వారు అడ్డుకున్నారు. ఈ ఘటనపై ఇద్దరితో మాట్లాడతామని, సమస్యకు కారణాలను పరిశీలిస్తామని సిటీ రాంపూర్‌ మెజిస్ట్రేట్‌ రాంజీ మిశ్రా పేర్కొన్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని