టీకా తర్వాత రక్తదానం.. ఎన్నిరోజులు ఆగాలి?

తాజా వార్తలు

Updated : 22/03/2021 06:09 IST

టీకా తర్వాత రక్తదానం.. ఎన్నిరోజులు ఆగాలి?

దిల్లీ: కొవిడ్‌ టీకా తీసుకున్నవారు రక్తదానం చేసే విషయంలో జాతీయ రక్తదాన మండలి (ఎన్‌బీటీసీ) కీలక సూచన చేసింది. రెండో డోసు తీసుకున్న తర్వాత 28 రోజుల వరకు రక్తదానం చేయొద్దని సూచించింది. గత నెలలో జరిగిన ఎన్‌బీటీసీ పాలకమండలి సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎన్‌బీటీసీ డైరెక్టర్‌ డాక్టర్‌ సునీల్‌ గుప్తా ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.

కొవిడ్‌ బారి నుంచి రక్షించుకోవడానికి తీసుకునే టీకా ఏదైనప్పటికీ రెండో డోసు తర్వాత 28 రోజులు ఆగాల్సిందేనని ఎన్‌బీటీసీ పేర్కొంది. అంటే తొలి డోసు తీసుకున్నాక 56 రోజులు పాటు రక్తదానం చేయొద్దని సూచించింది. రెండు డోసులు తీసుకున్న తర్వాతే శరీరంలో వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు తయారవుతాయని కేంద్ర ఆరోగ్యశాఖ ఇది వరకే వెల్లడించింది. అలాగే టీకా తీసుకున్నాక ఆల్కాహాల్‌కు దూరంగా ఉండాలా అనే విషయంలో ఏర్పడిన సందేహాన్ని ఆరోగ్యశాఖ ఇటీవల నివృత్తి చేసింది. మద్యపానం వల్ల టీకా ప్రభావశీలత తగ్గిందనడానికి ఎలాంటి ఆధారాలూ లభించలేదని నిపుణులు పేర్కొన్నట్లు తెలియజేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని