వీడియో చూడటమే పని!
close

తాజా వార్తలు

Published : 24/06/2021 10:19 IST

వీడియో చూడటమే పని!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో చాలా రకాల వింత ఉద్యోగాలు ఉన్నాయి. అలాంటి ఉద్యోగాల్లో ఇదీ ఒకటి. అమెరికాకు చెందిన ఓ సీసీటీవీ కంపెనీ భారతదేశంలో ఇలాంటి వినూత్న ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ప్రస్తుతం ఈ ఉద్యోగ ప్రకటన నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా దీనికి ఇంటర్మీడియట్‌,  ఆ పైన విద్యార్హత కలిగి ఉండి, కమ్యునికేషన్‌ స్కిల్స్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉన్నవాళ్లు అర్హులు. నెలకు జీతం రూ.30 వేలు ఇస్తారు. చేయాల్సిన పనేంటంటే.. సీసీటీవీ వీడియో చూస్తూ ఉండటమే. 

వాషింగ్టన్‌కు చెందిన లైవ్‌ ఐ సర్వైవలెన్స్‌ అనే సీసీటీవీ కంపెనీ ఈ ప్రకటన చేసింది. విదేశాల్లోని తమ కంపెనీకి చెందిన సీసీటీవీ పర్యవేక్షణలో ఉన్న సంస్థలను గమనిస్తూ.. ఆయా సంస్థల్లో ఉద్యోగులు జాగ్రత్తగా ఉన్నారా.. లేదా? సరిగా పనిచేస్తున్నారా.. లేదా? అనే విషయాలను తెలుసుకుంటూ ఉండాలి. వారికి కేటాయించిన పనులను పూర్తి చేయమని చెప్పాలి. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను గుర్తించి, వెంటనే హెచ్చరించాలి. ఈ వివరాలన్నింటితో ఒక నివేదిక తయారు చేయాలి. ఇవీ ఈ ఉద్యోగంలో చేయాల్సిన పనులు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని